బ్రిటన్ నుంచి వచ్చిన హీరోయిన్ కు కరోనా... పారిపోతుంటే పట్టుకున్న పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రిటన్ నుంచి వచ్చిన హీరోయిన్ కు కరోనా... పారిపోతుంటే పట్టుకున్న పోలీసులు!

British Actress Banita Sandhu Gets Corona
  • కోల్ కతాకు వచ్చిన బనితా సంధు
  • కరోనా సోకడంతో ఆసుపత్రికి రానని యాగీ
  • కవచంలా నిలబడి నిలువరించిన పోలీసులు
వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'అక్టోబర్' చిత్రంతో తెరంగేట్రం చేసి, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'ఆదిత్య వర్మ'తో కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుని, ఇప్పుడు 'కవితా తెరెసా' షూటింగ్ కోసం వచ్చిన బ్రిటీష్ నటి బనితా సంధుకు కరోనా సోకింది. ఆపై ఆమె తాను ఆసుపత్రికి రానంటూ మొండికేసి, పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సినిమా షూటింగ్ నిమిత్తం గత నెల 20న ఆమె కోల్ కతాకు వచ్చింది. అదే విమానంలో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ విమానంలో వచ్చిన అందరికీ వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. బనితా సంధుకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, అది కొత్త స్ట్రెయినా? కాదా? అనేది ఇంకా తేలలేదు.

ఈ క్రమంలో ఆమెను బెలియాఘటలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించి, అంబులెన్స్ ఎక్కించారు. తీరా ఆసుపత్రికి వెళ్లిన తరువాత, వాహనం దిగేందుకు నిరాకరించిన బనితా, నానాయాగీ చేసింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు, అంబులెన్స్ చుట్టూ కవచంలా నిలిచి, ఆమెను నిలువరించారు. ఆపై ఓ ప్రైవేటు ఆసుపత్రికి బనితాను పంపారు.
Banita Sandhu
Corona Virus
Hopital
Kolkata

More Telugu News