దేశ సరిహద్దులకు 118 మంది పాక్ ఉగ్రవాదులు... బీఎస్ఎఫ్ అలర్ట్!
- పలు లాంచ్ ప్యాడ్ల వద్ద మోహరింపు
- జీపీఎస్ వ్యవస్థలను అందించిన ఐఎస్ఐ
- నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం
వాస్తవానికి గత నవంబర్ లోనే ఉగ్రవాదులు ఒక చోటకు చేరుతుండటంపై ఇంటెలిజన్స్ కు ఉప్పందింది. కశ్మీర్ లోయ సమీపంలో 65 మంది టెర్రరిస్టులు ఆయుధాలతో సహా ఉన్నారని, వారు ఏ క్షణమైనా జొరబడవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. శీతాకాల పరిస్థితులు తమకు అనుకూలమని భావిస్తున్న ఉగ్రవాదులు, లునియా ధోక్, చిరికోట్ నబన్, దేగ్వార్ ట్రెవాన్, పీపి నాలా, కృష్ణ ఘాటి, భీంబర్ గాలి, నౌషెరా, సుందర్బానీ తదితర లాంచ్ ప్యాడ్లకు చేరారని తెలుస్తుండటంతో సరిహద్దుల్లో పహారాను మరింత కట్టుదిట్టం చేశారు.