రాజకీయాల్లో చేరాలంటూ వస్తున్న ఒత్తిళ్లు గంగూలీ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఉండొచ్చు: సీపీఎం నేత అశోక్ భట్టాచార్య
- గుండెపోటుతో ఆసుపత్రిపాలైన గంగూలీ
- యాంజియోప్లాస్టీ నిర్వహించిన కోల్ కతా వైద్యులు
- ప్రస్తుతం కోలుకుంటున్న దాదా
- ఆసుపత్రిలో గంగూలీని పరామర్శించిన స్నేహితుడు భట్టాచార్య
రాజకీయాల్లో చేరాలంటూ గంగూలీపై ఒత్తిళ్లు వస్తున్నాయని, కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గంగూలీని వాడుకోవాలని చూస్తున్నారని భట్టాచార్య ఆరోపించారు. బహుశా, ఈ ఒత్తిళ్లే గంగూలీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఉంటాయని అన్నారు. గంగూలీ ఓ క్రికెటర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారని, క్రికెట్ రంగంలో ఓ దిగ్గజం అని వెల్లడించారు. అయితే, తనకు తెలిసిన గంగూలీకి రాజకీయాలు సరిపడవని భట్టాచార్య స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లొద్దని గంగూలీకి కిందటి వారమే చెప్పానని, తన అభిప్రాయాన్ని ఆయన సానుకూల ధోరణిలో విన్నారని తెలిపారు. రాజకీయాల్లో చేరాలని గంగూలీపై ఒత్తిడి చేయడం తగదని హితవు పలికారు.