Corona Virus: దేశంలో కొత్త‌గా 16,375 మందికి కరోనా

India reports 16375 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,375 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 29,091 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 201 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,850కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  99,75,958 మంది కోలుకున్నారు. 2,31,036 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,65,31,997 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,96,236 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News