కరోనా టీకాను తొలుత ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు తీసుకోవాలి: పొన్నాల
- ప్రభుత్వాలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి
- టీకాపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి
- ఇతర దేశాల్లో అదే జరుగుతోంది
కరోనా టీకా త్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దానిని తొలుత ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు వేసుకోవాలని కోరారు. ఇతర దేశాల్లో అయితే ఆయా దేశాధి నేతలే తొలుత వ్యాక్సిన్ తీసుకుని ప్రజల్లో టీకాపై విశ్వాసం పెంచుతున్నారని, మన దగ్గర కూడా అలానే జరగాలని పొన్నాల కోరారు.