Kodali Nani: సీఎం జగన్ ను కలిసిన కొడాలి నాని!

Kodali Nani meets CM Jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి కొడాలి నాని హడావుడిగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ముఖ్యమంత్రి వద్దకు ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలో నిర్వహిస్తున్న ఓ పేకాట శిబిరంపై నిన్న రాత్రి ఎసీఈబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 28 కార్లను, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ పేకాట క్లబ్ ఓ మంత్రి కనుసన్నల్లో నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఓ వార్తాపత్రికలో దీనిపై ఓ కథనం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో, సీఎంను కొడాలి నాని హడావుడిగా కలవడం కొత్త చర్చకు దారి తీసింది. అయితే, సీఎంను కలవడానికి నాని ఎందుకు వెళ్లారనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు.
Go Back to Shorts
Kodali Nani
jagn
YSRCP

More Telugu News