హోటల్ లో లంచ్ చేసిన భారత క్రికెటర్లు.. వారికి తెలియకుండా బిల్లు చెల్లించిన అభిమాని!
- ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఘటన
- రోహిత్ శర్మ, పంత్, శుభ్ మన్ గిల్, నవదీప్ సైని లకు ఎదురైన అనుభవం
- బిల్లును పోస్ట్ చేసిన అభిమాని
మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శుభ్ మన్ గిల్, నవదీప్ సైని లకు ఈ అనుభవం ఎదురైంది. నవల్దీప్ సింగ్ అనే టీమిండియా అభిమాని తమ బిల్లును చెల్లించి వెళ్లాడని భారత క్రికెటర్లు నలుగురూ తెలుసుకున్నారు. ఆ నలుగురు క్రికెటర్లు తాను కూర్చున్న టేబుల్ ముందే కూర్చోవడంతో నవల్దీప్ సింగ్ తెగ సంబరపడిపోయి రహస్యంగా వారి లంచ్ బిల్లును చెల్లించేశాడు. తాను బిల్లును చెల్లించినట్లు క్రికెటర్లకు తెలియదంటూ నవల్దీప్ కూడా ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను పోస్ట్ చేశాడు.