Komatireddy Venkat Reddy: బీజేపీలో చేరబోతున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు తెలిపారు. నిజానికి ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన ఆయన ఊహాగానాలకు తెరదించారు. వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ఎప్పుడో చెప్పానన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు.

 తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన కోమటిరెడ్డి తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. పార్టీలు వేరైనా అన్నదమ్ములగా కలిసే ఉంటామన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ విషయమై మాట్లాడుతూ కొత్త అధ్యక్షుడిని కాలమే నిర్ణయిస్తుందన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలన్న కోమటిరెడ్డి.. ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ తండ్రికి తగ్గ కొడుకు కావాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు.
Komatireddy Venkat Reddy
Komatireddy Raj Gopal Reddy
Tirumala
Telangana
BJP
Congress

More Telugu News