నా భర్తలో ఇంత ఆనందం ఎన్నడూ చూడలేదు: అశ్విన్ భార్య ప్రీతి!
- తొలి టెస్టులో పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
- పదేళ్ల తరువాత అశ్విన్ చాలా ఆనందంగా కనిపించాడు
- ట్విట్టర్ లో వెల్లడించిన ప్రీతి
ఈ మ్యాచ్ లో విజయానంతరం తన భర్త ఎంతో సంతోషంగా ఉన్నాడని, ఆయన్ను ఇలా చూడటం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. మ్యాచ్ తరువాత తన భర్త ఆనందిస్తున్న వైనాన్ని ఆమె ఓ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. తన భర్త ఆడిన ఎన్నో టెస్టు మ్యాచ్ లను చూశానని, ఏ మ్యాచ్ తరువాతా తన భర్త ఇంత ఆనందంగా లేరని అన్నారు. ఇంకా చెప్పాలంటే, గత పదేళ్లలో అశ్విన్ ను ఇలా చూడలేదని ప్రీతి వ్యాఖ్యానించారు.