బ్యాంకు కుంభకోణం కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
- రేపు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశం
- గత సమన్లను పట్టించుకోని వర్ష రౌత్
- మరో నిందితుడి భార్యతో రూ. 50 లక్షల లావాదేవీ
సంజయ్ రౌత్ భార్యకు సమన్లు జారీ అయిన విషయం తెలిసిన వెంటనే బీజేపీ సీనియర్ నేత కిరీట్ సోమయ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పీఎంసీ బ్యాంకుతో ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపినట్టు అయితే ఆ విషయాన్ని రౌత్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆయన కుటుంబం లబ్ధిపొందిందా? గతంలో ఏమైనా దర్యాప్తు జరిగిందా? ఏవైనా నోటీసులు అందుకున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 10 లక్షల మంది ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారని, ఏదైనా సమాచారం ఉంటే ఈడీతో పంచుకోవాలని సూచించారు.