Varla Ramaiah: జడ్జిలను కించపరిచిన పూతలపట్టు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య డిమాండ్

Varla Ramaiiah demands action on Puthalapattu MLA
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు న్యాయవ్యవస్థలపై అసహనం వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జడ్జిలు ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని, వీళ్లసలు న్యాయమూర్తులేనా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై టీడీపీ అగ్రనేత వర్ల రామయ్య స్పందించారు.

"మీరు జడ్జిలేనా? ఎవరు డబ్బులిస్తే వారికి అనుకూలంగా తీర్పులిస్తారా? మరీ ఇంత అవినీతి పనికిరాదు, ఆయన చెప్పింది చేయడానికే మీరు న్యాయమూర్తులుగా ఉన్నారా?" అంటూ సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే (పూతలపట్టు) న్యాయస్థానాలను కించపరిచారని వర్ల రామయ్య ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే, న్యాయవ్యవస్థ గౌరవానికే భంగం అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Varla Ramaiah
MS Babu
MLA
Putrhalapattu
Judges
YSRCP
Telugudesam

More Telugu News