Corona Virus: దేశంలో కొత్తగా 23,068 మందికి కరోనా నిర్ధారణ

With 23068 new COVID19 infections
షార్ట్స్‌లో చూడండి
దేశంలో గత 24 గంటల్లో 23,068 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 24,661 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,46,846కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 336 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,47,092కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 97,17,834 మంది కోలుకున్నారు. 2,81,919 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,63,05,762 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,97,396 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News