రేపు నాని అభిమానులకు 'టక్ జగదీశ్' నుంచి క్రిస్మస్ కానుక
- నాని హీరోగా టక్ జగదీశ్
- శివ నిర్వాణ దర్శకత్వంలో నాని 26వ సినిమా
- డిసెంబరు 25న ఫస్ట్ లుక్ రిలీజ్ కు సన్నాహాలు
- సోషల్ మీడియాలో వెల్లడించిన చిత్రబృందం
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ విరామానంతరం 'టక్ జగదీశ్' షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభమైంది. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ వంటి సీనియర్లు నటిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లో 26వది. 'టక్ జగదీశ్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.