క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
- రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మార్పులు
- ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్
- ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ సాహ్ని
- అదే రోజున బాధ్యతలు స్వీకరించనున్న ఆదిత్యనాథ్ దాస్
ఈ నేపథ్యంలో, నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అక్కడే ఉన్నారు. కాగా, ఈ నెల 31తో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ పదవీకాలం ముగియనుండగా, అదేరోజున ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు.