India: దేశంలో కొత్తగా 23,950 మందికి కరోనా నిర్ధారణ

india records 2395new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో గత 24 గంటల్లో 23,950 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 26,895 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,99,066కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 333 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,46,444కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 96,63,382 మంది కోలుకున్నారు. 2,89,240 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,42,68,721 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,98,164 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News