Sujeeth: 'సాహో' దర్శకుడికి బాలీవుడ్ పిలుపు!

Sujith to make a Bollywood movie
  • 'రన్ రాజా రన్'తో సుజీత్ కి మంచి హిట్ 
  • 'సాహో'తో బాలీవుడ్ ని ఆకట్టుకున్న వైనం  
  • చేజారిన చిరంజీవి 'లూసిఫర్' అవకాశం
  • విక్కీ కౌశల్ హీరోగా హిందీ సినిమా  
మన తెలుగు దర్శకులు అప్పుడప్పుడు హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తుండడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇటీవలి కాలంలో కూడా ఇక్కడ హిట్లు కొట్టే యువ దర్శకులకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అదే కోవలో మరో యువ దర్శకుడు సుజిత్ కూడా త్వరలో ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు.

శర్వానంద్ తో 'రన్ రాజా రన్' చిత్రాన్ని రూపొందించి, మంచి హిట్ చేసిన సుజీత్ కి ఆ వెంటనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. మూడు వందల కోట్ల బడ్జెట్టుతో ప్రభాస్ తో ఆయన చేసిన 'సాహో' చిత్రం తెలుగులో సక్సెస్ కాలేదు. కానీ, హిందీ వెర్షన్ మాత్రం సుజీత్ కి మంచి పేరుతెచ్చింది. స్టయిలిష్ టేకింగ్ తో బాలీవుడ్ ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'లూసిఫర్' రీమేక్ విషయంలో చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది.

ఈ క్రమంలో ఇప్పుడతనికి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్టు చెబుతున్నారు. సుజీత్ చెప్పిన కథ విక్కీకి బాగా నచ్చడంతో వెంటనే ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ, ఓ ప్రముఖ సంస్థ దీనిని నిర్మించడానికి ముందుకు వచ్చిందనీ సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
Sujeeth
Prabhas
Chiranjeevi
Vikki Koushal

More Telugu News