Manchu Vishnu: చిరంజీవి అంకుల్ ని కలిశా... ఎందుకో త్వరలో చెబుతా: మంచు విష్ణు

Manchu Vishnu met Megastar Chiranjeevi
  • చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన మంచు విష్ణు
  • ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం దక్కిందన్న యువ హీరో
  • తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వెల్లడి
  • చిరు మెగాస్టార్ కావడంలో ఆశ్చర్యంలేదని కితాబు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇవాళ బిగ్ బాస్ చిరంజీవి అంకుల్ ను కలిశానని వెల్లడించారు. ఆయనను ఎందుకు కలిశానన్నది త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు . అయితే, ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం దక్కిందని, ఈ క్రమంలో ఎంతో నేర్చుకున్నానని వివరించారు. ఈ అవకాశాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఆయనను అందరూ మెగాస్టార్ అనడంలో ఆశ్చర్యమేమీ లేదని కొనియాడారు. అంతేకాదు, చిరంజీవితో దిగిన సెల్ఫీని కూడా మంచు విష్ణు ట్విట్టర్ లో పంచుకున్నారు.
Manchu Vishnu
Chiranjeevi
Interview
Tollywood

More Telugu News