Pavan Kalyan: పవన్ రీమేక్ సినిమాకు అలనాటి టైటిల్?

Title for Pawan Kalyans latest movie considered
  • ఫిబ్రవరిలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్'
  • తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్రలలో పవన్, రానా
  • హీరోయిన్లుగా సాయిపల్లవి, ఐశ్వర్య రాజేశ్?
  • టైటిల్ గా 'బిల్లా రంగా'కు యూనిట్ మొగ్గు      
ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి భారీ మొత్తం చెల్లించి హక్కులు తీసుకున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్, బిజూమీనన్ పోషించిన ప్రధాన పాత్రలను తెలుగు వెర్షన్ లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగును రెండు రోజుల క్రితం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించే అవకాశం వుంది. ఇక చిత్రం టైటిల్ విషయానికి వస్తే.. 'బిల్లా రంగా' అనే పేరు బాగా వినిపిస్తోంది. చిత్రకథకు ఇది సరైన టైటిల్ అవుతుందని భావిస్తున్నారట. పవన్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. దీంతో దాదాపు దీనినే ఫైనల్ చేస్తారని సమాచారం.

1982లో 'బిల్లా రంగా' పేరుతో ఓ చిత్రం వచ్చిన సంగతి చాలామందికి తెలిసుంటుంది. చిరంజీవి, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా అప్పట్లో అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Pavan Kalyan
Rana Daggubati
Sai Pallavi

More Telugu News