పాత వాహనాలకు వైసీపీ రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం చేస్తున్నారు: నారా లోకేశ్
- దిశ పోలీసులకు ద్విచక్రవాహనాలు
- వీడియో పంచుకున్న లోకేశ్
- పోలీసు వాహనాలకు పార్టీ రంగులేంటని విస్మయం
- రంగులతో రక్షణ రాదని స్పష్టీకరణ
- మృగాళ్లను శిక్షిస్తేనే మహిళలకు ధైర్యం వస్తుందని వివరణ
అంతేకాదు, ఈ సందర్భంగా లోకేశ్ పోలీసులకు చురకలంటించారు. అవి వైసీపీ రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో సమయం వృథా చేయకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టిపెడితే మంచిదని హితవు పలికారు. ఈ సందర్భంగా దిశ పోలీసులకు పంపిణీ చేస్తున్న ద్విచక్రవాహనాల వీడియోను కూడా పంచుకున్నారు.