దేశంలో 24 గంటల్లో 26,624 మంది కరోనా

India records 26624 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,00,31,223
  • మృతుల సంఖ్య 1,45,477
  • కోలుకున్న 95,80,402 మంది
  • మొత్తం 16,11,98,195 కరోనా పరీక్షలు
దేశంలో గత 24 గంటల్లో 26,624 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 29,690 మంది కోలుకున్నారు.  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,31,223కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 341 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,45,477 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,80,402 మంది కోలుకున్నారు. 3,05,344 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,11,98,195 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,07,681 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News