లోన్ యాప్‌లపై పోలీసుల ఉక్కుపాదం.. యాప్ యజమానికి బేడీలు
- పోలీసుల అదుపులో హైదరాబాద్ యువకుడు
- నాలుగు యాప్‌లు సృష్టించి అప్పులు
- రహస్య ప్రాంతానికి తరలించి విచారణ
రెండు రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఏఈవోగా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని మౌనిక (24) రుణదాతల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌పూర్‌కు చెందిన సునీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సునీల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నగరానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు నాలుగు యాప్‌లు సృష్టించి వాటి ద్వారా రుణాలు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్టు తెలిసింది. అతడి బ్యాంకు ఖాతాల్లోని నిల్వలను తనఖీ చేస్తున్నారు.