Bandi Sanjay: పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: బండి సంజయ్

KCR will definitely go to jail says Bandi Sanjay
  • పాతబస్తీ సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా ఎందుకు మారింది?
  • హిందువులను అవమానిస్తే ఊరుకునేది లేదు
  • పాతబస్తీకి వస్తూనే ఉంటాం
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతకాని తనం వల్ల హైదరాబాద్ అభివృద్ది ఆగిపోయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ మేయర్ తాము కాలేకపోయినా... ఒక శివాజీలా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా పోరాడుతామని చెప్పారు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డిలతో గతంలో ఒవైసీ కలిసి ఉన్నారని... ఇప్పుడు కేసీఆర్ తో కలిసి ఉన్నారని తెలిపారు. పాతబస్తీ అభివృద్ధి గురించి ఒవైసీని నిలదీయరా? అని ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు.

పాతబస్తీ సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా ఎందుకు మారిందో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని... కానీ, హిందువులను అవమానిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మేయర్ ఎన్నికలను కొర్పొరేటర్ల కొనుగోళ్ల కోసం వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.

పాతబస్తీ తమ అడ్డా అని... ఇక్కడకు వస్తూనే ఉంటామని అన్నారు. తెలంగాణలో ఏ ఆలయం జోలికి గాని, ఆలయ స్థలం జోలికి గానీ వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈరోజు బీజేపీ తరపున గెలిచిన కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
Asaduddin Owaisi
MIM

More Telugu News