Dhanush: ధనుశ్ చేతిలో మరో హాలీవుడ్ సినిమా

Dhanush signs for another Hollywood movie
  • తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు
  • గతంలో 'ద ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్' చేసిన ధనుశ్
  • తాజాగా రూసో బ్రదర్స్ దర్శకత్వంలో 'ది గ్రే మేన్' సినిమా 
  • తన స్ట్రీమింగ్ కోసం నిర్మిస్తున్న ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్   
ధనుశ్.. కొత్తదనం కోసం పరితపించే తమిళ హీరో. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలని కోరుకుంటాడు. అలాంటి కథలనే ఎంచుకుంటాడు. అందుకే, అనతి కాలంలోనే తన మాతృభాష తమిళంలోనే కాకుండా, ఇటు తెలుగు.. అటు హిందీ ప్రేక్షకులలో కూడా మంచి ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నారు. అంతేకాదు, రెండేళ్ల క్రితం ఎల్లలు దాటి 'ద ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్' అనే  హాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో హాలీవుడ్ ప్రాజక్టును చేస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అతనే వెల్లడించాడు.

'ది గ్రే మేన్' అనే హాలీవుడ్ సినిమాలో తాను హీరోగా నటిస్తున్నట్టు, ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ సినిమాలో జెస్సికా హెన్ విక్ కథానాయికగా నటిస్తుంది. రూసో బ్రదర్స్ దీనికి దర్శకత్వం వహించనుండడం విశేషం. గతంలో 'ఎవెంజర్స్', 'కెప్టెన్ అమెరికా', 'వింటర్ సోల్జర్' వంటి చిత్రాలకు రూసో బ్రదర్స్  దర్శకత్వం వహించారు. రెయాన్ గోలింగ్, క్రిస్ ఎవేన్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తన స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తోంది.
Dhanush
Hollywood
The Extraordinary Journey of the Fakir

More Telugu News