Telangana: తెలంగాణలో కరోనా తొలి టీకాను ఎవరికి వేయబోతున్నారంటే...!

Gandhi Hospital nurse will be the first to take Covid vaccine
  • గాంధీ ఆసుపత్రి నర్సుకు తొలి టీకా వేయాలని నిర్ణయం
  • వైద్య సిబ్బందికి తొలి విడతలోనే వ్యాక్సిన్
  • వ్యాక్సిన్ అందిన రెండు రోజుల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయం
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో వ్యాక్సిన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా టీకా పంపిణీకి కార్యాచరణను రూపొందిస్తోంది. వ్యాక్సిన్ తెలంగాణకు చేరిన రెండు రోజుల్లోగానే పంపిణీని ప్రారంభించాలని భావిస్తున్నారు. మూడు కోట్ల డోసుల వ్యాక్సిన్ ను నిల్వచేసేందుకు సరిపడా ప్రత్యేక కోల్డ్ చైన్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు.

మరోవైపు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ను ఎవరికి ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి నర్సుకు తొలి వ్యాక్సిన్ ఇచ్చి... కార్యక్రమాన్ని ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే, దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్య సిబ్బందికి తొలి విడతలోనే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 16 సంవత్సరాల్లోపు వారికి టీకా వేయబోమని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఆ వయసు వారిపై వ్యాక్సిన్ ను పరీక్షించకపోవడమే దీనికి కారణం.
Telangana
Corona Vaccine
First Dose

More Telugu News