Stray Dog: ఓ దొంగ నుంచి మహిళను కాపాడిన వీధి కుక్క... వీడియో ఇదిగో!
- ఏ సంబంధంలేని మహిళను కాపాడిన కుక్క
- మహిళ హ్యాండ్ బ్యాగ్ లాక్కునేందుకు దొంగ ప్రయత్నం
- దొంగ పైకి దూకిన వీధి కుక్క
- పరుగులు తీసిన దొంగ
- వీడియో వైరల్
శునకాలను విశ్వాసానికి మారుపేరుగా పేర్కొంటారు. అయితే, ఓ వీధి కుక్క ఏ సంబంధంలేని మహిళను దొంగ బారి నుంచి కాపాడిన ఘటన నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ మహిళ చేతిలో లగేజీతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా, ఓ వ్యక్తి ఆమెనే ఫాలో అవడం వీడియోలో చూడొచ్చు.
ఆ సమయంలో ఓ వీధి కుక్క రోడ్డుపై నిల్చుని ఉండగా, అదే సమయంలో ఆ వ్యక్తి మహిళ నుంచి హ్యాండ్ బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ మహిళ కిందపడిపోగా, ఇది గమనించిన వీధి కుక్క ఒక్కసారిగా ఆ వ్యక్తిపైకి దూకి అతడ్ని తరిమికొట్టింది. కుక్క వెంటపడడంతో ఆ దొంగ కాలికి బుద్ధిచెప్పడం వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది.