Perni Nani: వయసుకు తగ్గట్టుగా చంద్రబాబు మాట్లాడటం లేదు: పేర్ని నాని

Chandrababu is not behaving appropriate to his age says Perni Nani
  • చంద్రబాబు పోరాటమంతా లోకేశ్ కోసమే
  • రాబోయే రోజుల్లో టీడీపీ మట్టికొట్టుకుపోతుంది
  • రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరించాలి
ఈరోజు ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. 19 నెలల పాలనలో ఏం పీకావ్? అంటూ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో ఆగ్రహావేశాలను రగిలించాయి. వైసీపీ నేతలంతా వరుసగా ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వయసుకు తగ్గట్టుగా చంద్రబాబు మాట్లాడటం లేదని విమర్శించారు.

చంద్రబాబు చేస్తున్న పోరాటం ప్రజల కోసం కాదని... ఆయన కుమారుడు లోకేశ్ కోసమని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే దొంగ సర్టిఫికెట్లు తమ ప్రభుత్వానికి అవసరం లేదని చెప్పారు. రానున్న రోజుల్లో టీడీపీ మట్టికొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఉన్నవారు తమకు భూమి వద్దు, ప్లాట్లు కావాలని కోరుతున్నారని... భూమి వద్దు, ప్లాట్లు కావాలనుకునే వారు రైతులు ఎందుకవుతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తే బాగుంటుందని అన్నారు.
Perni Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Nara Lokesh

More Telugu News