Corona Virus: దేశంలో 99,56,558కి చేరిన కరోనా కేసులు

Indias total cases rise to 9956558
షార్ట్స్‌లో చూడండి
దేశంలో గత 24 గంటల్లో 24,010 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558కు చేరింది. ఇక గత 24 గంటల్లో 33,291 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 355 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  1,44,451కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,89,740 మంది కోలుకున్నారు. 3,22,366 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,78,05,240 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,58,960  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News