Corona Virus: దేశంలో 99,32,548కు చేరిన కరోనా కేసుల సంఖ్య

Indias total cases rise to 9932548
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో గత 24 గంటల్లో 26,382 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,32,548కు చేరింది. ఇక గత 24 గంటల్లో 33,813 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 387 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,44,096కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,56,449 మంది కోలుకున్నారు. 3,32,002 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,66,46,280 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,85,625 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News