Corona Virus: దేశంలో 98,57,029కు చేరిన కరోనా కేసులు

 Indias total cases rise to 9857029
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 30,254 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,57,029కి చేరింది.

ఇక గత 24 గంటల్లో 33,136 మంది కోలుకున్నారు. గత 24 గంట‌ల సమయంలో 391 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,43,019కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 93,57,464 మంది కోలుకున్నారు. 3,56,546 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,37,11,833 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,14,434 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News