బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం.... చెల్లాచెదురైన కార్మికులు
- వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు
- ఎగసిపడిన మంటలు
- భయంతో పరుగులు తీసిన కార్మికులు
- పలువురు మృతి చెంది ఉంటారని అనుమానం
- సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
- పక్కనున్న పరిశ్రమల నుంచి ఖాళీ చేయిస్తున్న అధికారులు
కాగా, పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కాగా, మంటలు ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో అధికారులు సమీపంలోని పరిశ్రమలను కూడా ఖాళీ చేయిస్తున్నారు. నల్లని పొగలు సుడులు తిరుగుతూ అక్కడి వాతావరణం భీతావహంగా ఉంది.
కాగా, పరిశ్రమలోని ఓ రియాక్టర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడైంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బాచుపల్లి ఆసుపత్రికి తరలించారు.