Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్!

  Indias total cases rise to 9796770
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 29,398 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కు చేరింది. ఇక గత 24 గంటల్లో 37,528 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 414 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,42,186 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,90,834 మంది కోలుకున్నారు. 3,63,749 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News