అలనాటి అందాల బ్రిటిష్ సినీ నటి డేమ్ బార్బారా ఇకలేరు!
- 1954 నుంచి నటిస్తున్న డేమ్ బార్బారా విండ్సర్
- గత నాలుగేళ్లుగా అల్జీమర్స్ వ్యాధి
- కన్నుమూశారని తెలిపిన భర్త స్కాట్ మిచెల్
ఆమె నటించిన 'ఈస్ట్ ఎండర్స్', 'ది క్యారీ ఆన్' కామెడీ సిరీస్ చిత్రాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా 'ది క్యారీ ఆన్' సిరీస్ లో 31 చిత్రాలు రాగా, 9 చిత్రాల్లో ఆమె నటించారు. అల్జీమర్స్ సొసైటీకి ప్రచారకర్తగానూ ఉన్న ఆమె, గతంలో ప్రధాని బోరిస్ జాన్సన్ ను కలిసి, ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచే కార్యక్రమాలనూ నిర్వహించాలని కోరారు. డేమ్ బార్బారా మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు.