శరద్ పవార్ కు యూపీఏ పగ్గాలు అనే వార్తలపై ఎన్సీపీ స్పందన
- ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు
- తమకు ప్రతిపాదనలు కూడా రాలేదు
- ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు
ముఖ్యంగా గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే బాగుంటుందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి. దీంతో, యూపీఏ ఛైర్మన్ పదవిని శరద్ పవార్ చేపట్టబోతున్నారనే వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై ఎన్సీపీ నేత మహేశ్ తపసీ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా తమకు ఎలాంటి ప్రతిపాదనలు కూడా రాలేదని అన్నారు. యూపీఏలో ఉన్న మిత్రులతో చర్చలు కూడా జరగలేదని చెప్పారు. రైతులు చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి పుకార్లను పుట్టిస్తున్నాయని అన్నారు.