ప్రాజెక్టులు కట్టడం చేతగాక ఇలా పేర్లు మారుస్తారా?: దేవినేని ఉమ

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కట్టిన ప్రాజెక్టుల పేర్లను మార్చడం తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను కట్టలేకపోతోందని ఆయన విమర్శలు గుప్పించారు. పలు వార్తా చానెళ్లలో ఈ విషయంపై వచ్చిన వార్తలను ఈ సందర్భంగా ఆయన పోస్టు చేశారు.

‘ప్రాజెక్టులు కట్టడం చేతగాక పేర్లు మారుస్తారా? నాడు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన కృష్ణాలో ముక్త్యాల, అనంతపురంలో పరిటాల రవీంద్ర లిఫ్ట్ కు మీ తండ్రిపేర్లు పెట్టుకోవడం కోసం18 నెలలు ఆలస్యం చేస్తారా? ఏడాదిన్నరలో ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చుపెట్టారు? తెలుగు దేశం పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల పేర్లు మార్చడం తప్ప మీరు ఏంచేశారు వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News