వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హుల నమోదుకు... తెలంగాణ 'కొవిడ్' యాప్!
- తొలి విడతలో దాదాపు 75 లక్షల మందికి టీకా
- పది రోజుల్లో సిద్ధం కానున్న వ్యాక్సిన్
- యాప్ ద్వారా పేర్ల నమోదు
వీరితో పాటు 50 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలోనే 70 నుంచి 75 లక్షల మందికి టీకాలు వేయాలని నిర్ణయించామని, దాదాపు 3 కోట్ల డోస్ లను నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇక వ్యాక్సిన్ పై ఎంపిక చేసిన వైద్య సిబ్బందికి ప్రత్యేక ట్రయినింగ్ క్యాంప్ కూడా మొదలైంది. నిన్న వర్చ్యువల్ విధానంలో ప్రారంభమైన శిక్షణ, నేడు కూడా కొనసాగనుంది.