'తమన్నానే రియల్ హీరో' అంటున్న హీరో!

Tamannas new film enters second schedule
  • కన్నడలో హిట్టయిన 'లవ్ మాక్ టైల్'
  • 'గుర్తుందా శీతాకాలం' పేరిట రీమేక్
  • హీరో హీరోయిన్లుగా సత్యదేవ్, తమన్నా
  • తమన్నాతో గ్రాఫ్ మారిందంటున్న హీరో  
స్టార్ హీరోల సరసన పలు సినిమాలలో నటించిన అగ్రతార తమన్నా ఇప్పుడు ఓ చిన్న సినిమాలో సత్యదేవ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఆ సినిమా పేరు 'గుర్తుందా శీతాకాలం'. కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' హిట్ సినిమా ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు. దీనికి కన్నడ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.

ఇందులో నటించడం గురించి తమన్నా చెబుతూ, లాక్ డౌన్ సమయంలో చాలా కథలు విన్నాను. అయితే, ఈ కథ వినగానే ఎందుకో ఇందులో నటించాలని వెంటనే అనిపించింది. అందుకే ఒప్పేసుకున్నాను. ఇలాంటి రొమాంటిక్ డ్రామాలో నటించి చాలాకాలం అయింది. ఇక సత్యదేవ్ ఈ సినిమాకి పెర్ఫెక్ట్ హీరో అవుతాడు' అని చెప్పింది.

హీరో సత్యదేవ్ చెబుతూ, ఇందులో తమన్నా నటిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచీ ఈ సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అందుకే, ఈ సినిమాకి హీరో నేను కాదు.. తమన్నానే రియల్ హీరో' అని చెప్పాడు. కన్నడలో తాను స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ, తెలుగులో తనకిదే తొలి సినిమా అని చెప్పారు దర్శకుడు నాగశేఖర్.
Go Back to Shorts
Thamanna
Satyadev
Love Mocktail

More Telugu News