ఫుల్లుగా తాగి రోడ్డుపై పోలీసులతో గొడవ పడిన మహిళా అసిస్టెంట్ డైరెక్టర్

Women assistant director fights with police
  • తన మిత్రుడితో కలిసి కారులో వెళ్తున్న కామిని
  • డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన కామిని మిత్రుడు
  • తాగితే తప్పేంటని కామిని గొడవ
చెన్నైలో ఓ మహిళా అసెస్టెంట్ డైరెక్టర్ తప్పతాగి రోడ్డుపై రచ్చ చేసింది. పోలీసులతో గొడవ పడింది. ఓ పోలీసు అధికారిని బూతులు తిడుతూ, భౌతిక దాడికి దిగింది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్ కామిని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తన మిత్రుడు శేషు ప్రసాద్ తో కలిసి కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా కారు నడుపుతున్న శేషు మోతాదుకు మించి మందు తాగినట్టు తేలింది. దీంతో, పోలీసులు వారి కారును సీజ్ చేశారు.

దీంతో, పోలీసులపై కామిని గొడవకు దిగింది. తాగితే తప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను కొట్టేందుకు కూడా వెళ్లినట్టు వీడియోలో కనపడుతోంది. శేషు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్భాషలాడటం, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Go Back to Shorts
Assistant Director
Kamini
Chennai
Police

More Telugu News