Uddandarayunipalem: ఉద్ధండరాయునిపాలెంలో రాళ్లదాడి... దీక్షాశిబిరం వద్ద ఉద్రిక్తత

Stone pelting at Uddandarayunipalem
షార్ట్స్‌లో చూడండి
అమరావతి ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ ఉద్యమిస్తున్న వారికి, మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నవారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటింటా అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలను మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్న బృందం అడ్డుకుంది.

దాంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో రాళ్ల దాడి చోటుచేసుకుంది. దాంతో ఉద్ధండరాయునిపాలెంలో నిర్వహిస్తున్న దీక్షాశిబిరంలో ఉన్న మహిళలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘర్షణలు విస్తరించకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Go Back to Shorts
Uddandarayunipalem
Stone Pelting
Amaravati
Three Capitals
Police

More Telugu News