ఆఖరి అంకానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్... టీఆర్ఎస్ ముందంజ

  • గ్రేటర్ లో కారు జోరు
  • ఇప్పటివరకు 42 డివిజన్లలో గెలుపు ఖరారు
  • ఇంకా 42 డివిజన్లలో కొనసాగుతున్న కౌంటింగ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్పష్టత దిశగా గ్రేటర్ తీర్పు వస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 150 డివిజన్లకు గాను 108 డివిజన్ల ఫలితాలపై స్పష్టత వచ్చింది. టీఆర్ఎస్ 42 డివిజన్లలో గెలుపు ఖాయం చేసుకుంది. 39 డివిజన్లలో ఎంఐఎం జెండా రెపరెపలాడింది. బీజేపీ 25 డివిజన్లతో మూడోస్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లతో సరిపెట్టుకుంది. ఇంకా 42 డివిజన్లకు గాను ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

GHMC Elections
Counting
Final Phase
TRS
MIM
BJP

More Telugu News