India: దేశంలో 94,99,414కి చేరిన కరోనా కేసుల సంఖ్య

indias total cases rise to 9499414
  • గత 24 గంటల్లో 36,604 మందికి కరోనా  
  • మృతుల సంఖ్య 1,38,122
  • కోలుకున్న వారు 89,32,647 మంది
భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 36,604 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,99,414కి చేరింది. ఇక గత 24 గంటల్లో 43,062 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 501 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,38,122కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 89,32,647 మంది కోలుకున్నారు. 4,28,644 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,24,45,949 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,96,651 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

India
Corona Virus
COVID19