చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
- మల్కాపూర్ గేటు వద్ద ప్రమాదం
- ఇన్నోవా కారు, బోర్‌వెల్ వాహనం ఢీ
- మరో నలుగురికి తీవ్రగాయాలు
- బాధితులు హైదరాబాద్ తాడ్‌బండ్ వాసులుగా గుర్తింపు
ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నట్లు తెలిపారు. తాడ్‌బండ్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న సమయంలో ఆ ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బోర్‌వెల్ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల పేర్లు అసిఫ్‌ఖాన్, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభాను అని చెప్పారు.