రైతు ఉద్యమాన్ని క్రూరంగా అణచివేయాలనుకోవడం సరికాదు: ఏఐఐఈఏ
- రైతు ఉద్యమానికి క్రమంగా పెరుగుతున్న మద్దతు
- కనీస మద్దతు ధర పొందడాన్ని న్యాయపరమైన హక్కును చేయాలి
- రైతుల అణచివేతతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం
ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతులు చేపట్టిన ఉద్యమాన్ని క్రూరంగా అణచివేయాలని చూస్తుండడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారని, వారిని అణచివేస్తే దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడంతోపాటు ఇతర జాతీయ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని ఏఐఐఈఏ ఆవేదన వ్యక్తం చేసింది.