Corona Virus: దేశంలో 94 లక్షలు దాటిన కరోనా కేసులు

Indias total cases rise to 9431692
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 38,772 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,31,692కి చేరింది. ఇక గత 24 గంటల్లో 45,333 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 443 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,37,139 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 88,47,600 మంది కోలుకున్నారు. 4,46,952 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,03,79,976 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,76,173 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News