కవిత గారూ, నేను జోకర్‌ను కాదు.. ఫైటర్‌ని: బండ్ల గణేశ్
- ఎన్నికల ప్రచారంలో బండ్ల గణేశ్‌ను జోకర్ అన్న కవిత
- ఇప్పుడు బండి సంజయ్ ఆయనను మించిపోయాడంటూ సెటైర్లు
- తాను రాజకీయాల్లో లేనంటూ కవితకు గణేశ్ కౌంటర్
కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేశ్.. తాను జోకర్‌ను కాదని, ఫైటర్‌ను అని పేర్కొన్నారు. ‘‘కవితగారూ, నేను జోకర్‌ను కాదు. ఫైటర్‌ను. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. వాటిలో తలదూర్చాలని కూడా అనుకోవడం లేదు. మీకు ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశారు.