మరో వివాహానికి సిద్ధమవుతున్న గాయని సునీత?
- వ్యాపారవేత్తతో త్వరలో వివాహం?
- అధికారికంగా చెప్పని సునీత
- మొదటి భర్తతో గతంలోనే విడాకులు
కాగా, చిన్న వయసులోనే... అంటే 19 ఏళ్లకే సునీతకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె, చాలా కాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఆయనతో విడాకులు కూడా మంజూరు అయ్యాయని, ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీత తెలిపారు. ఆపై రెండో పెళ్లిపై ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచనా లేదని కూడా అన్నారు. అయితే, ప్రస్తుతం సునీత తన మనసును మార్చుకున్నారని, ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిల్లో నిజం తెలియాలంటే సునీతే స్పందించాల్సి వుంది.