Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్!

Indias total cases rise to 9392920
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,810 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,92,920 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,298 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 496 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,36,696 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 88,02,267  మంది కోలుకున్నారు. 4,53,956 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,95,03,803 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 12,83,449 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News