Corona Virus: దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

43082 new COVID19 infections
  • 24 గంటల్లో 43,082 మందికి కరోనా
  • మృతుల సంఖ్య  1,35,715
  • కోలుకున్న వారు 87,18,517 మంది
  • 4,55,555 యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 43,082 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,09,788 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 39,379 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 492 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  1,35,715 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 87,18,517 మంది కోలుకున్నారు. 4,55,555 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,70,62,749 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,31,204 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News

Corona Virus
COVID19
India