రోహింగ్యాలపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు: తలసాని
- ఇన్ని రోజులు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైంది?
- చర్యలు ఎందుకు తీసుకోలేదు?
- కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కి హైదరాబాద్ గురించి ఏం తెలుసు?
ఎంత సేపూ టీఆర్ఎస్ పై పడి ఏడవటం కాదని... హైదరాబాదుకు ఏం చేస్తారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఉండే బండి సంజయ్ కి హైదరాబాద్ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాదులో జరిగిన అభివృద్ధి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ముంటే వారి విరోధులను దేశ బహిష్కరణ చేయాలని సవాల్ విసిరారు.