సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉపశమన చర్యలతో కచ్చితంగా టాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుంది: రాజమౌళి
- సినీ రంగానికి ఊరట కలిగించే చర్యలు ప్రకటించిన సీఎం కేసీఆర్
- టాలీవుడ్ లో వెల్లివిరుస్తున్న హర్షం
- సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి
దీనిపై టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ లో స్పందించారు. ఎంతో అవసరమైన దశలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉపశమన చర్యలతో తెలుగు సినీ పరిశ్రమలో ఆనందం పొంగిపొర్లుతోందని తెలిపారు. ఈ నిర్ణయాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కచ్చితంగా మళ్లీ పుంజుకుని అభివృద్ధి పథంలో నడుస్తుందని రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. "మీకు కృతజ్ఞులమై ఉంటాం కేసీఆర్ సర్" అంటూ ట్వీట్ చేశారు.