రూ. 2.20 కోట్లు దాటిన తిరుమల హుండీ ఆదాయం!
- ఆదివారం నాడు స్వామిని దర్శించుకున్న 32,640 మంది
- మంగళవారం తిరుమలకు రానున్న రాష్ట్రపతి కోవింద్
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కాగా, రేపు ఉదయం తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకునే ఆయన, తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై మధ్యాహ్నం తిరుమలకు వెళ్లి, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. కోవింద్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.